Monday, August 30, 2010

బుద్ద జయంతి , Buddha Jayanthi



బుద్ద పౌర్ణిమ లేదా బుద్ధ జయంతి అనేది బుద్ధుడి జయంతిని సూచించే పర్వదినం. దీన్ని సర్వసాధారణంగా వైశాఖ పూర్ణిమ నాడు జరుపుకుంటారు. ఇది హిందూ కేలండర్ ప్రకారం ఏప్రిల్ లేదా మేనెల మొదట్లో వస్తుంటుంది. బుద్ద పూర్ణిమ బౌద్ధులకు ముఖ్యమైన పర్వదినం. బుద్ధుడు క్రీస్తు పూర్వం 560లో జన్మించి 80 ఏళ్ల వయసులో క్రీస్తుపూర్వ 480లో పరమపదించాడు. తన మరణానంతరం భారత ఉపఖండంలో బౌద్ధమతం బహుళ ప్రజాదరణ పొంది విదేశాల్లో కూడా పలుకుబడి సంపాదించుకుంది. బుద్ధ పౌర్ణమి రోజున బుద్ధుడు జీవితానికి సంబంధించి పంచసూత్రాలను, సత్యానికి సంబంధించిన అష్టాంగ మార్గాలను బోధించిన అనంతరం జ్ఞానోదయం పొందాడు. బుద్ధుడు సరిగ్గా తన జన్మదినం రోజే నిర్వాణం పొందాడు. లేదా ప్రపంచాన్ని వదలి వెళ్లిపోయాడు.

ఈ విధంగా బుద్ధ జయంతి గౌతమబుద్ధుడి జీవితంలోని మూడు కీలకమైన ఘటనలను వర్ణిస్తుంది. ప్రపంచం నలుమూలలనుంచి బౌధ్దులు బుద్ధ జయంతిరోజు భారత్ లోని బోధ్ గయకు వచ్చి బుద్ధ పౌర్ణమి సంబరాల్లో పాలు పంచుకుంటారు. ఈ సందర్భంగా వారు బుద్ధ చిత్రాలను చిత్రిస్తారు. సామూహిక ధ్యానంలో పాల్గొంటారు. బౌధ్ద విగ్రహానికి పూజలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైశాఖ పూర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమను నేపాల్, సింగపూర్, వియత్నా, థాయ్‌లాండ్, కాంబోడియా, మలేసియా, శ్రీలంక, మయన్మార్, ఇండోనేషియా, పాకిస్తాన్, భారత్ వంటి దక్షిణాసియాల ఆగ్నేయాసియా దేశాల్లోని బౌద్ధులు జరుపుకుంటారు. పేరుకు ఇది బుద్ధ జయంతి అని పిలువబడినప్పటికీ బుద్ధుడు జన్మించింది, జ్ఞానోదయం పొందిందీ, నిర్వాణం పొందిందీ ఒకే రోజున కావడంతో ఇది విశేషంగా గుర్తింపు పొందింది. మహాయాన బౌద్ధ సంప్రదాయాల ప్రకారం ఈ పర్వదినాన్ని వైశాఖ పర్వదినంగా పిలుస్తుంటారు. భారత్‌లో దీన్ని మే 9న బుద్ధ జయంతి లేదా బుద్ధ పూర్ణిమ పేరుతో పిలుస్తుంటారు. నెలలో పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉండటంతో దీనికి బుద్ధ పూర్ణిమ అని కూడా పేరు పడింది.



For full details see telugu wikipedia.org -- boudda jayanthi

  • ====================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: